రేణు దేశాయ్ మోడల్ గా ఆమె ఎంతో పాపులర్ …తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు, ఇక తర్వాత పవన్ కల్యాణ తో ప్రేమలో పడ్డారు ..ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు, అయితే వివాహం అయ్యాక ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసిన నటించారు రేణూదేశాయ్.
కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేసింది రేణూ దేశాయ్. కొన్ని మనస్పర్దల వల్ల పవన్ తో ఆమె విడాకులు తీసుకున్నారు, అయితే పిల్లలు ఇద్దరూ మాత్రం ఆమె దగ్గరే పెరుగుతున్నారు. పూణెలో ఆమె సొంత నివాసంలో ఉంటోంది రేణూదేశాయ్.
ఇక పవన్ కు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె కొద్ది కాలానికి చిత్ర పరిశ్రమపై ఫోకస్ చేశారు… ఓ మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు. ఇష్క్ వాలా లవ్ అంటూ వచ్చిన ఈ సినిమా 2014లో విడుదలైంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా చేశారు.ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి సినిమాల్లో రెడీ అయ్యారు రేణూదేశాయ్. అనేక క్యారెక్టర్లు చేయాలి అని దర్శకులు కోరినా ఆమె రిజక్ట్ చేశారట.