శరత్ బాబు- రమాప్రభ ఎందుకు విడిపోయారో తెలుసా?

-

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) వ్యక్తిగత జీవితంలో అనేక ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. సినిమాల్లోకి అరంగేట్రం చేసిన సమయంలోనే అప్పటికే నటిగా రాణిస్తున్న రమాప్రభ(Ramaprabha)ను 1974లో శరత్ బాబు పెళ్లి చేసుకున్నారు. వయసులో తనకంటే పెద్దదైన రమాప్రభను ఆయన ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే వీరి మధ్య వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడంతో 1988లో విడాకులు తీసుకున్నారు. రమాప్రభకు ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదించి ఇచ్చానని శరత్ బాబు(Sarath Babu) ఇటీవల కాలంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. ఆయనే తన చేత బలవంతంగా నా ఆస్తులు రాయించుకున్నారని రమాప్రభ తెలిపారు. మరి ఏది నిజమో ఇంతవరకు ఎవరికి తెలియదు.

- Advertisement -

ఆమెతో విడిపోయిన అనంతరం 1990లో తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహలతను రెండో పెళ్లి చేసుకున్నాడు శరత్ బాబు. వీరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో 2011లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. అనంతరం హీరోయిన్ నమితతో ప్రేమ వ్యవహారం నడిపారని.. ఆమెను మూడో పెళ్లి చేసుకున్నారని గాసిప్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Read Also: పొంగుటేటి ఓ బచ్చా.. డబ్బుతో బలిసిపోయారు: పువ్వాడ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...