పుష్పలో బన్నీ, రష్మిక, సుకుమార్‌, సమంతల పారితోషికం ఎంతో తెలుసా?

Do you know the reward of Bunny, Rashmika, Sukumar and Samantha in the flower?

0
107
Pushpa 2

పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా మొదటి రోజు(డిసెంబర్‌ 17) నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్‌ సాధించింది.

ఈ రేంజ్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న పుష్ప సినిమాకు నటీనటులు, దర్శకుడు సుకుమార్‌ ఎంతరెమ్యునరేషన్‌ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. పుష్ప చిత్రం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నాడట. హీరోయిన్‌ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర డబ్బులు తీసుకుందట.

విలన్‌గా నటించిన మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ రూ.3.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడంటున్నారు. దర్శకుడు సుకుమార్‌ పాతిక కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ రూ.3.5 కోట్లు, ఐటం సాంగ్‌లో చిందేసిన సమంత రూ.1.5 కోట్లు తీసుకున్నారని భోగట్టా. నెగెటివ్‌ పాత్రను పోషించిన యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఒకరోజు షూటింగ్‌కు రూ.1.5-2 లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది.