టాలీవుడ్ లో బిజీ కమెడియన్ అంటే బ్రహ్మానందం అనే చెప్పాలి, హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా ఆయనదే.. ఒక్కో సినిమాకి భారీ రెమ్యునరేషన్ అందుతుంది ఆయనకి.. ఇక ఆయన సినిమాలో ఉంటే అది సూపర్ హిట్ అనే అంటారు..బ్రహ్మీ సినిమాలో ఉండాల్సిందే అని చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా దర్శక నిర్మాతలతో చెబుతారు.. దర్శకులు కూడా ఆయనకు కథలో పాత్ర రాస్తారు.
అయితే ఆయన ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా అన్నీంటికి ఒప్పుకోవడం లేదు, మరీ ముఖ్యంగా కథ బాగా నచ్చి ఆ పాత్ర నచ్చితే ఆయన చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.. అయితే ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.
ఇక గత ఏడాది బన్నీ సినిమా అల వైకుంఠపురంలో నటించారు బ్రహ్మానందం.. ఇక యువ కమెడియన్లు చాలా మంది మళ్లీ బిజీ అవుతున్నారు వెన్నెల కిషోర్, సప్తగిరి, శకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి యువ కమెడియన్ల పలు పాత్రలు చేస్తున్నారు.. అయితే బ్రహ్మీ ఆస్తుల గురించి టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఆయనకు 350 కోట్ల రూపాయల వరకూ ఆస్తులు ఉంటాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.. పలు వ్యాపారాలు కమర్షియల్ కాంప్లెక్సులు కూడా ఆయనకు ఉన్నాయట, ఆయన కుమారుడు వాటిని చూసుకుంటారు అని టాలీవుడ్ టాక్.