టాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు తమ నటనతో ఎంతో పేరు సంపాదించారు..ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి దివ్యభారతి. ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 25, 1974 న దివ్యభారతి జన్మించింది.టాలీవుడ్ కి ఆమె బొబ్బిలి రాజా చిత్రంతో పరిచయం అయింది, ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు.. దర్శకుడు బి గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
ఇక తెలుగులో పలు సినిమాలు చేసి తర్వాత సౌత్ ఇండియాలో అనేక స్టార్ హీరోలతో ఆమె చిత్రాలు చేసింది… తెలుగు తమిళంలో పలు సినిమాలు చేసింది, 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. ఒకే ఏడాదిలో ఇలా బిజీగా 15 సినిమాలు పూర్తి చేసింది ఆమె.
దివ్యభారతి మే 10 న 1992 లో సాజిద్ నడియాడ్వాలాను పెళ్లి చేసుకుంది. ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది… అయితే ఆమె మరణానికి ఇప్పటికీ కారణం తెలియదు. ఏది ఏమైనా చిన్న వయసులోనే ఆమె మన నుంచి దూరం అయింది.