దేవదాసు, దసరా బుల్లోడు అంటే టక్కున వినిపించేది ఏఎన్నార్. సినిమా పరిశ్రమలో ఆయనది ఓ చరిత్ర.
78 ఏళ్లు ఏఎన్నార్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. నాగేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1941లో ధర్మపత్ని సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో అందుకున్నారు.
పద్మ విభూషణ్ సైతం పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడు అక్కినేనిగారు మాత్రమే.
భారతరత్న తప్పించి అన్నీ అవార్డులు అందుకున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అనే బిరుదును 1957 ఆగస్ట్ లో అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా బెజవాడలోనే ఏఎన్నార్ అందుకున్నారు.
నట సార్వభౌమ, నట రాజశేఖర, కళాప్రవీణ, అభినయ నవరస సుధాకర, కళా శిరోమణి,అభినయ కళాప్రపూర్ణ, భారతమాత ముద్దుబిడ్డ వంటి బిరుదులు ఉన్నాయి.
1967లో పద్మశ్రీ పురస్కారం
1988లో పద్మభూషణ్..
1990 రఘుపతి వెంకయ్య అవార్డ్
మే 1991 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
నవంబర్ 1995 తమిళనాడు సర్కారు నుంచి అన్న అవార్డ్
నవంబర్ 1996 ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్
2011లో పద్మ విభూషణ్ అవార్డు పొందారు.
అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. మేఘ సందేశం,బంగారు కుటుంబం చిత్రాలలో నటనకు గాను రెండు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందారు.