ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా గురించి ఈ విషయాలు తెలుసా

Do you know these things about Itlu Sravani Subrahmanyam movie?

0
99

దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టోరీలు ఎంత బావుంటాయో తెలిసిందే. ఎంతో వేగంగా సినిమాలు తీస్తారు పూరి. సక్సస్ ఫుల్ డైరెక్టర్ చాలా మంది అగ్రహీరోలతో ఆయన సినిమాలు తీశారు. బద్రి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్. గతంలో తాను రాసుకున్న ఓ కధ‌ని కొంచెం మార్చి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాని తీశారు. ముందు సుమంత్, తరుణ్ దగ్గరకు ఈ స్టోరీ వెళ్లింది కాని వారు చేయలేదు ఫైనల్ గా రవితేజ దగ్గరకు ఈ స్టోరీ వచ్చింది.

పూరీ లైఫ్ ని మార్చిన సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ముందు రవితేజ హీరో అనగానే నిర్మాతలు ఎవరూ రాలేదు. ఈ సమయంలో రవితేజ స్నేహితులైన వేణుగోపాల్ రెడ్డి, శేషురెడ్డి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు.
టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యూషని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అప్పటికి మరో తమిళ్ సినిమా ఆఫర్ రావడంతో ఆమె చేయలేదు.

ఇక ఈ సినిమాలో తనూరాయ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఓ రోజు ఫ్లైట్ లో వెళ్తున్న పూరీ జ‌గ‌న్నాథ్ కి ఎయిర్ హోస్టెస్ నచ్చడంతో సినిమాల్లో నటిస్తారా అని అడిగారు. ఆమె సమ్రీన్ ఆమె కూడా నటించారు. మొత్తం ఈ సినిమా 45 రోజుల్లో ఫినిష్ చేశారు. చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ బిజీ అయ్యారు. అలాగే రవితేజకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.