షియాజీ షిండే టాలీవుడ్ లో విలన్ గా అనేక సినిమాలు చేశారు. ఆయన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు టైమింగ్ పంచ్ అలాగే విలనిజం అద్బుతంగా చూపిస్తారు ఆయన. వెండితెరపై అందరూ స్టార్ హీరోల సినిమాల్లో ఆయన నటించారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ సినిమాలో ఆయన నటన ఎంత బాగుంటుందో తెలిసిందే.
ఆయన మరాఠి నటుడు ఇక తెలుగు సినిమాలు చాలా వరకూ ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆయన వాయిస్ కూడా ఓ ప్లస్ అయింది. అతడు సూపర్, ఠాగూర్, వీడే, గుడుంబా శంకర్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేవదాసు పోకిరి ఈ సినిమాలు ఆయనకు మరిన్ని అవకాశాలు తీసుకువచ్చాయి. మరాఠి, తెలుగు, హిందీ,తమిళ్, కన్నడ, మలయాళం,గుజరాతీ సినిమాల్లో కూడా షియాజీ షిండే నటించాడు.
ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించారు. ఇక ఆయన ప్రైమరీ స్కూల్ విద్య అంతా సొంత గ్రామంలో చదువుకున్నారు. తర్వాత పక్క ఊరులో 10వ తరగతి చదివారు. కాలేజీలో ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్ గా పనిచేసారట. పగలు చదువుకుని రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్ గా పని చేసి ఆ జీతంతో కాలేజీలో చదువుకున్నారు. నాటకాలు అంటే ఇంట్రస్ట్ ఉండంతో 1978లో ఆయన నాటకాల వైపు వెళ్లారు అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చారు.