తెలుగు సినిమాల్లో ఎందరో నటులు నటించారు చాలా మంది గొప్ప పేరు సంపాదించారు.. అయితే కత్తి యుద్దం అంటే ముందు వినిపించే పేరు మాత్రం వెంటనే కత్తి కాంతారావు అంటారు.. ఆయన ఖడ్గ విన్యాసం అంత గొప్పగా ఉంటుంది.
ఆయన ఖడ్గ విన్యాసానికీ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లు కూడా హాట్సాఫ్ చెప్పారు. జానపద చిత్రసీమలో ఆయనకు ఎంతో పేరు వచ్చింది. అలా అందుకే ఆయన పేరున కాంతారావు అయితే కత్తి చేర్చారు.
ఆయన జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా వందల సినిమాల్లో నటించారు.నారద పాత్రలు ఎక్కువ వేసింది కూడా ఆయనే.. కాంతారావు 1923 నవంబర్ 16న నల్గొండ జిల్లా గుడిబండ గ్రామంలో జన్మించాడు..
ఆయన పూర్తిపేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. కోదాడలో ఆయన చదువు జరిగింది.. సురభి నాటక సమాజంలో ఆయన చేరారు, అక్కడ నుంచి ఆయన సినిమాల్లో నటించారు.
ప్రతిజ్ఞ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. విఠలాచార్య సినిమాలు వస్తే ఆయన కచ్చితంగా నటించేవారు.. ఎలాంటి డూప్ లేకుండా సినిమాల్లో నటించేవారు….లవకుశలో ఆయన నటనకు జాతీయ అవార్డు వచ్చింది…ఇక ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించేవారు… దాదాపు ఆయన 500 సినిమాల్లో నటించారు… ఇక తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఆయన పెద్దగా ఆస్తులు ఏమీ సంపాదించుకోలేదు..86వ యేట 2009 మార్చి 22న అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూసారు. నిజంగా ఆయన ఓ గొప్ప నటుడు అనే చెప్పాలి.
ReplyForward
|