విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

0
111

రౌడీహీరో విజయ్​దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘లైగర్’​. భారీ అంచనాలతో గురువారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయింది. అలాగే కలెక్షన్స్​ పరంగా కూడా నిరాశపరిచింది.

లైగర్’ మొదటి రోజు కలెక్షన్ల విషయానికొస్తే.. మొత్తం రూ. 24.50 కోట్ల గ్రాస్, రూ. 13.35 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, నైజంలు కలిపి రూ. 9.55 కోట్లు షేర్, రూ. 15 కోట్ల గ్రాస్ రాబట్టగా.. నైజంలో రూ. 4.20 కోట్ల షేర్, రూ. 7 కోట్ల గ్రాస్, సీడెడ్‌లో రూ. 1.30 కోట్ల షేర్, రూ. 1.85 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాద్ సినిమా కావడంతో ‘లైగర్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని..కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్లు బాగున్నాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఇటీవల విడుదలైన సినిమాల్లో లైగర్ మాత్రమే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించింది. అంతేకాకుండా మిడ్ రేంజ్ హీరోల్లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా విజయ్ దేవరకొండ లైగర్ నిలిచింది. మరి రౌడీకి ఇది మొదట పాన్ ఇండియన్ లెవెల్‌ మూవీ కావడంతో.. లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.