కింగ్ నాగార్జున ఇప్పటికీ నవ మన్మధుడు అనే చెప్పాలి, ఇక తనయుడు హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, కింగ్ నాగార్జున ఒకే చెప్పడంతో వీరి వివాహం జరిగింది, అయితే సమంత అక్కినేని వారి కోడలిగా ఎంట్రీ ఇచ్చి అందరితో తక్కువ సమయంలోనే కలిసిపోయింది, ఇటు చైతూకి దగ్గుబాటి కుటుంబం అన్నా ఇష్టమే వారితో కూడా సమంత చాలా క్లోజ్ గా ఉంటుంది.
ఇక మామ అక్కినేని నాగార్జున, అత్త అమల, మరిది అఖిల్ తో ఆమె చాలా సరదాగా ఉంటుంది.. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విదేశీ ట్రిప్పులకి వెళుతూ ఉంటారు, అయితే సమంత తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేసింది ఇటీవల. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
ఇప్పటి వరకు మీకు నాగార్జున ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటి అని ప్రశ్నించారు ఓ అభిమాని… వెంటనే ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలుసా….మామ ఎస్ చెప్పడమే పెద్ద గిఫ్ట్ … అంటే చైతూతో పెళ్లికి ఎస్ చెప్పడమట, నిజంగా సమంతకు అదేపెద్ద గిఫ్ట్ అని చెప్పింది…ఇంత కంటే పెద్ద గిఫ్ట్ తనకేది ఉండదని, దాన్ని జీవితాంతం వదులుకోనని చెప్పింది సమంత….ఇక చైతూ సమంత వివాహం 2017 అక్టోబర్7న వైభవంగా జరిగింది. ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు తెలుగు చిత్ర సీమలో.