నారప్పలో కన్నమ్మలా నటించిన ఈమె ఎవరో తెలుసా

Do you know who she is who Acting Kannamma Character in Narappa Movie ?

0
188

కరోనా పరిస్ధితుల వల్ల చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. మన దేశంలో అన్ని చిత్ర సీమల్లో ఇదే పరిస్దితి కనిపిస్తోంది. తాజాగా విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్కు రీమేక్ సినిమా. తెలుగులో కూడా మంచి పేరు సంపాదించింది. సినిమా చూసిన అందరూ కూడా బాగుంది అంటున్నారు. వెంకీ నటన చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.

అసురన్లో మరియమ్మలా, నారప్పలో కన్నమ్మలా ఇద్దరు హీరోలతో ఆడిపాడిన ఈ నటి అందరికి బాగా నచ్చింది. ఆమె ఎవరు అని తెగ తెలుసుకుంటున్నారు సినిమా అభిమానులు. నారప్ప సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ల్ లో  వెంకటేశ్ ప్రేయసిగా కనిపించే ఈమె పేరు అమ్ము అభిరామి. ఆమెది తమిళనాడు ఇక చదువుకునే సమయం నుంచి ఆమె సినిమాల్లో నటిస్తుంది.

2017లో వచ్చిన విజయ్ భైరవ సినిమాలో మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. ఇక తెలుగులో రాక్షసుడు సినిమాచూస్తే ఆమె అందులో హీరోకి మేనకోడలి పాత్ర చేసింది. ఇందులో కూడా ఆమె నటన చాలా బాగుంది.
ఇక ఫాదర్ ఆఫ్ చిట్టి ఉమా కార్తీక్ చిత్రంలో ఉమ పాత్రలో అలరించింది. మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఆమెని సౌత్ ఇండియాలో చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో తీసుకోవాలి అని చూస్తున్నారట.