సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంది ఉంటారు… అందులో ప్రేక్షకులని తన నటనతో మెప్పించిన వారు కొందరు ఉంటారు.. అందులో చెప్పుకోవాలి అంటే ముందు వినిపించే పేరు సురేఖవాణి… తెరపై ఆమె నవ్వులు పూయిస్తుంది, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది.
సురేఖ వాణి తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య వదిన పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు, ఇక ఫిజిక్ మెయింటేన్ చేసే విషయంలో హీరోయిన్స్ కూడా ఆమెని చూసి షాక్ అవుతారు….సురేఖవాణి ఆమె కుమార్తె కలిసి సోషల్ మీడియాలో చేసిన పలు వీడియోలు వైరల్ అవుతాయి.
ఆమెభర్త సురేష్ తేజ 2019లో అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే… వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు, ఇక ఆయన బుల్లితెరలో చాలా మందికి తెలిసిన వ్యక్తి…అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్గా పనిచేశారు. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి ప్రోగామ్స్కు దరకత్వం వహించారు. ఇలా ఆయన బుల్లితెరలో చాలా మందికి పరిచయం.