తెలుగు నటి మెహ్రీన్ తనదైన నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది, ఇక తాజాగా ఆమెకి పెళ్లి సెట్ అయింది అనే విషయం తెలిసిందే, మరి మెహ్రీన్ పెళ్లి చేసుకునేది ఎవరిని ఆ విషయాలు చూద్దాం…నిన్న నిశ్చితార్థం జరిగింది
తెలుగు నటి మెహ్రీన్ కు..
మెహ్రీన్ తెలుగులో నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహానుభావుడు చిత్రంలో నటించింది.ఎఫ్2 లో ఆమె నటనకి అందరూ ప్రశంసించారు, ఇక ఇప్పుడు ఎఫ్ 3 లో కూడా ఆమె నటిస్తోంది.
ఇక ఆమె ఎవరిని వివాహం చేసుకుంటోంది అంటే .. కాంగ్రెస్ యువనేత భవ్య బిష్ణోయ్ను పెళ్లాడనుంది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్..అదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు.
రాజకీయంగా బాగా పేరున్న కుటుంబం రాష్ట్రంలో, ఇక వీరి ఎంగేజ్ మెంట్ జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుక పిక్స్ కొన్ని మెహ్రీన్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఏడాదే వీరి వివాహం జరుగుతుందని మెహ్రీన్ తల్లి పమ్మి పిర్జాదా తెలిపారు. ఇక ఈ జంటకు అందరూ సోషల్ మీడియా వేదికగా విషెస్ అందచేస్తున్నారు.