టాలీవుడ్ లో కృతి శెట్టి పేరుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈమె గురించి తెగ మాట్లాడుకుంటున్నారు, వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటోంది తొలి చిత్రంతో, ఇటు తెలుగు తమిళ కన్నడ సినిమా పరిశ్రమల వారు ఈమె డేట్స్ గురించి క్యూ కడుతున్నారట.
కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఇక రెమ్యునరేష్ కూడా ఆమెకి భారీగా పెరిగింది అంటున్నారు… ఇక ఈ సినిమాలో ఆమె నటనకి ప్రశంసలు వచ్చాయి…అయితే ఆమె వయసు గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
చిన్న పిల్లలా ఉంది కదా అంటూ ఆసక్తి మొదలైంది. ఆమె వయసు 17 సంవత్సరాలు ఆమె 2003లో జన్మించింది..
కృతి శెట్టి ప్లస్ టూ చదువుతున్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి, ఇక గతంలో ఆమె పలు యాడ్స్ చేసింది..
ప్రస్తుతం నాని శ్యామ సింగ రాయ్తో పాటు సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తుంది కృతి శెట్టి… ఇక పలు తమిళ దర్శకులు కూడా ఆమెకి కథలు చెబుతున్నారట.