బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లహరి షారి ఎవరో తెలుసా

Do you know who this Lahari Shari who gave entry into Bigg Boss is?

0
91

ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 సరికొత్తగానే ఉంది. కంటెస్టెంట్లు చాలా మంది తెలిసిన వారే ఉన్నారు. వెండితెర, బుల్లితెర నటులు యూట్యూబర్లను తీసుకువచ్చారు బిగ్ బాస్. ఇప్పుడు అందరూ లహరి షారి గురించి తెలుసుకుంటున్నారు. బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి ఆట బాగా నచ్చుతోంది ఫ్యాన్స్ కి. ఇంతకీ ఈ లహరి షారి ఎవరు అనేది చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ నెం 3గా ఎంట్రి ఇచ్చింది లహరి. ఈమె గురించి చెప్పాలి అంటే యాంకర్ ,న్యూస్ రీడర్, మోడల్ , నటి అని చెప్పాలి .విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్ గా నటించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి ఇలా పలు చిత్రాల్లో నటించింది ఈ అందాల తార.

ఈమెకు ఫ్యాన్స్ బేస్ బాగా పెరిగింది ఆమె ఆట నచ్చుతోంది. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడుతోంది లహరి. అదే అందరికి నచ్చుతోంది. సో ఆమెకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక హౌస్ లో టాప్ 5లో ఆమె ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్.