బ్రహ్మాజీ తన నటనతో తెలుగు చిత్ర సీమలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.. ఆయన ఎందరో దర్శకులు హీరోలతో వర్క్ చేశారు, సూపర్ ఆర్టిస్టుగా ఆయనకి మంచి పేరు ఉంది టాలీవుడ్ చిత్ర సీమలో. అయితే ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.. అయితే ఆయన పెళ్లి చేసుకున్న ఆమె గురించి ఎవరికి తెలియదు.
ఆయన వివాహం అయి ఆల్రెడీ ఓ కుమారుడు ఉన్న ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయితే అప్పటికే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు..ఈ సమయంలో చెన్నైలో ఆమెతో ఆయనకు పరిచయం ఏర్పడింది.. శశ్వతి ఆమె పేరు, ఇక ఇద్దరూ బాగా ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నారు.. అలా మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.
తనకు నచ్చింది కాబట్టి ఆమెని పెళ్లి చేసుకున్నానని పలు ఇంటర్వ్యూలలో బ్రహ్మజీ తెలిపారు. ఇక పెళ్లి అయిన తర్వాత మరి పిల్లలు వద్దు అనుకున్నారు.. ఇక ఓ కుమారుడు ఉన్నాడు కాబట్టి తనే నా కొడుకు అని భావించారు ఆయన..ఒకవేళ పిల్లలు పుడితే తను ఎక్కడ స్వార్ధంగా ఆలోచిస్తానో అని ఇలా ఆలోచించారట, అందుకే ఆయనని ఆదర్శ మూర్తి అంటారు అందరూ. నిజంగా ఆయనది చాలా మంచి మనసు, ఎందరికో సాయం చేసిన గొప్ప వ్యక్తి.