సెలబ్రిటీలు ఐఫోన్ ఎందుకు వాడతారో తెలుసా?

-

ఐఫోన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ కంపెనీ. ఈ ఫోన్ వాడకాన్ని రిచ్ సింబల్ గా భావిస్తుంటారు. ఐపాడ్ నుంచి ఇయర్ బడ్స్ వరకు సూపర్ ఫీచర్స్ తో అదరగొడుతుంటాయి. చాలా కాస్ట్లీగా ఉండే ఈ ఫోన్లను సెలబ్రెటీలు ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

కస్టమర్స్ డేటాను భద్రతపర్చడంలో యాపిల్ ను మించిన కంపెనీ లేదు. థర్డ్ పార్టీ యాప్ ల డేటా చోరీని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లను హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు సాధ్యపడదు. అంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తోంది యాపిల్ కంపెనీ.

మనం మాట్లాడుకునే విషయాలను ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా ఐఫోన్ రికార్డు చేయదు. యాపిల్ ఎకో సిస్టం ద్వారా ఐఫోన్‌, వాచ్‌, ల్యాప్‌టాప్ అన్ని యాపిల్‌ కంపెనీవే అయితే ఒకదానిలోని సమాచారం మరొక దానిలోకి ఈజీగా మార్చుకోవచ్చు.

ఐఫోన్లలో ఏదైనా రిపేర్ వస్తే యాపిల్ సర్వీస్ సెంటర్ కు మాత్రమే వెళ్లాలి. అక్కడ కూడా గోప్యత, భద్రత పాటిస్తూ రిపేర్ చేస్తారు సిబ్బంది. మిగిలిన ఫోన్లను ఏ మొబైల్ షాపులోనైనా రిపేర్ చేయించుకోవచ్చు.

ఇక ఐఫోన్ కెమెరా పనితీరు చాలా క్వాలిటీగా ఉంటుంది. ఎడిట్ చేయకుండానే ఐ ఫోన్‌లో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకోవచ్చు. అందుకే సెలబ్రెటీలు పెట్టే ఫోటోలు, వీడియోలు చాలా క్వాలిటీగా ఉంటాయి.

ఐ ఫోన్లలో ఉండే ప్రత్యేకమైన ఐఓఎస్‌.. మల్టీ ట్యాబ్స్ ఓపెన్ చేసినా హ్యాంగ్ అవకుండా చూస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా వచ్చే సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఐఫోన్లలో కంపెనీ అందిస్తుంటుంది. దీంతో ఫోన్లు చాలా స్పీడుగా పనిచేస్తాయి. ఇన్ని కారణాల వల్ల సెలబ్రెటీలు ఐఫోన్ వాడేందుకు ఇష్టపడతారు.

Read Also: రాజాసింగ్ శోభయాత్రపై ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...