మన దేశంలో ఎందరో సంగీత దర్శకులు ఉన్నారు కాని వారిలో ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి అంటే సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ అనే చెప్పాలి, ఆయన బాణీలు అద్బుతం అనే చెప్పాలి.1967 జనవరి 6న చెన్నైలో పుట్టారు ఆయన. రెహమాన్ మొదటి పేరు.. దిలీప్ కుమార్. తండ్రి ఆర్.కె.శేఖర్ కూడా మ్యూజిక్ కంపోజరే. ఆయన తండ్రిలో పలు స్టూడియోలకు వెళ్లేవారు.
ఇలా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకున్నారు, ఇక తండ్రి మరణించిన తర్వాత ..ఇంట్లో మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్లను అద్దెకు ఇచ్చి కొన్నాళ్లపాటు జీవనం సాగించారు. అలా ఆయన సంగీత దర్శకుడిగా పైకి ఎదిగారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఆయన చెల్లికి ఓ వింత అనారోగ్యం వచ్చింది ఈ సమయంలో ఎన్ని గుడులు తిరిగినా తగ్గలేదు, అయితే ముస్లిమ్స్ దర్గాలో ప్రార్ధనలు చేసిన తర్వాత రోగం తగ్గితే మతం మారుతాను అని ప్రమాణం చేశారట.
దీంతో తర్వాత ఆమె రోగం నయం అయింది… దీంతో 1989లో ఫ్యామిలీతో పాటు ఇస్లాం స్వీకరించారు రెహమాన్. అలా ఆయన పేరు దిలీప్ కుమార్ నుంచి రెహమాన్ గా మారింది.