మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న “డాక్టర్ సాబ్”…

-

నిజ జీవితంలో డాక్టర్లు ఎదుర్కొనే పరిస్థితులు వారు అనుభవించే కష్టాలను ఆధారంగా చేసుకొని ఓ సినిమాను తెరకెక్కించి డాక్టర్లు పడుతున్న కష్టాలను వారి పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో తెరకెక్కుతున్న సినిమా “డాక్టర్ సాబ్”.డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ , ఎస్పీ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శోభన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం ప్రారంభం కాగఎంతో విజయవంతంగా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ నా స్నేహితుడు, దర్శకుడు డి.ఎస్.బి ఎంతో అద్భుతమైన కథను సిద్ధం చేశారని కథ వినగానే నచ్చడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే మొదటి షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఎక్కడ కాంప్రమైస్ అనేది లేకుండా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత ఈ సందర్భంగా మాట్లాడారు.మొదటి షెడ్యూల్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలియజేశారు.

ఈనెల 25వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో భాగంగా వినాయకుడి పై గణపతి లిరికల్ సాంగ్ ని విడుదల చేసినట్లు ఆ పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుందని ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో వైవిధ్యభరితంగా నిజజీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం అమ్మ పండు వహించగా, ఎన్ మురళీకృష్ణ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు.పాట‌లు న‌ర్సింగ‌రావు,
పిఆర్ ఓ సాయి సతీష్, పర్వతనేని వ్యవహరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...