కాజల్ వివాహం పై క్లారిటీ ఇచ్చేసింది, తనే నేరుగా ప్రకటన చేసింది, అయితే తన పెళ్లి అక్టోబర్ 30న ముంబైలో జరుగుతుందని ప్రకటించగానే అందరూ ఆమెకి అభినందనలు తెలిపారు. మరి ఆ వరుడు ఎవరు అనేది చూద్దాం.
ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లూ ని ఆమె వివాహం చేసుకోబోతోంది,క్యాథేడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదువుకొన్నాడు అతను. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి టప్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చి సొంతంగా లైఫ్స్టైల్కు సంబంధించిన డిజైన్ కంపెనీ ది ఎలిఫాంట్ అనే కంపెనీని 2012లో ప్రారంభించారు.
ఇక సొంతంగా ఎదగడం అతనికి ఇష్టం, ఇక తర్వాత 2015లో డిస్క్రెన్ లివింగ్ అనేపేరుతో మరో డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు, ఇక ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ కూడా చేస్తున్నాడు, అంతేకాదు అతని ఆస్తి ఎంత ఉంటుంది అనేదానిపై తాజాగా 60 కోట్ల వరకూ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి, ఖరీదైన ఇళ్లు ప్లాట్స్ కార్లు కమర్షియల్ ప్లేస్ లు కూడా ఆ కుటుంబానికి ముంబైలో ఉన్నాయట.. ఇప్పటి వరకు ముంబై మారథాన్లో ఏడుసార్లు పాల్గొన్నారు. ఈ కరోనా తగ్గిన తర్వాత గ్రాండ్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది స్నేహితులకి.