రాజమౌళి ఒక్కో సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0
104

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ సినిమా తీసినా.. చరిత్రే. బాహుబలి, ఈగ లాంటి సినిమాలు ఆయన కెరీర్ ను  మార్చేశాయి. ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్నారు జక్కన్న.

అయితే ఈ దర్శక ధీరుడు తీసిన ఏ ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దాదాపు ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు ఈ దర్శకధీరుడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఓ రేంజ్లో జరుగుతున్నాయి. దీంతో ఆయన రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఆసక్తిగా… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆయన ఒక్కో సినిమాకు గాను 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం అందుతోంది. బాహుబలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన 30 శాతం లాభాలు కూడా తీసుకున్నారు.

ఈ సినిమాకు కూడా ఆయన అదే విధంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన ఆస్తులు 150 కోట్ల వరకు ఉంటాయని అలాగే 100 కోట్ల వరకు ఖరీదైన బంగ్లాలు ఉంటాయని టాక్. ఇక ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు కూడా రాజమౌళి ఉన్నారని తెలుస్తోంది. ఆయన ఆస్తులు… గత మూడు సంవత్సరాల నుంచి 40 శాతం పెరిగినట్లు సమాచారం అందుతోంది.