మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీకి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?

Does that sentiment resonate with Mahesh's 'Sarkaru Vari Pata' movie?

0
123

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట విషయంలో అతి పెద్ద అప్డేట్ ఇటీవలే వచ్చింది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదలను వాయిదా వేశారు. దాంతో అభిమానుల్లో కాస్త నిరాశ కనిపించినప్పటికీ..బ్లాక్ బస్టర్ సినిమా కోసం వెయిట్ చేయడంలో తప్పులేదు అంటూ కాంప్రమైజ్ అవుతున్నారు అభిమానులు.

సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సమయంలో విడుదలైన మ‌హేష్ బాబు పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాకూడా హాలీడే సమయంలో రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవాలని చుస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.  మరి ఈ సినిమాకు రీలీజ్ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి.