టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.. ఇక ఆయన ఎంచుకునే పాత్రలు కథలు అద్బుతం అనే చెప్పాలి.. అందుకే అనేక సూపర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.. ఫ్యామిలీ హీరో మాస్ క్లాస్ యాక్షన్ కామెడీ ఇలా ఏది అయినా ఆయన అవలీలగా చేస్తారు… ఇక తాజాగా ఆయన నారప్ప సినిమా పూర్తి చేశారు.
మే 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.. ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఎఫ్ 2 ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికే ఎఫ్ 3 సినిమా కూడా సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. ఇక మరో సూపర్ హిట్ చిత్రం దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 కూడా చేస్తున్నారు.
ఎఫ్ 3సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగస్టు 27వ తేదీన దీనిని విడుదల చేయనున్నట్టు చెప్పారు, అయితే ఇప్పుడు దృశ్యం సినిమా ముందు వస్తుందా ఎఫ్ 3 ముందు వస్తుందా అనేది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అన్నీ సెట్ అయితే జూన్ లో దృశ్యం 2 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.