‘ఆకాశంలో ఒక తార’ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ అంటే..!

-

Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి. సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి దుల్కర్ తనలోని లవర్ బాయ్ యాంగిల్ చూపిస్తాడని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇంతలోనే మరో అప్‌డేట్‌తో మూవీ టీం మన ముందుకు వచ్చేసింది. ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేయనుంది ‘ఆకాశంలో ఒక తార’.

- Advertisement -

ఈ నేపథ్యంలో సెన్సార్ కూడా పూర్తి కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఏపీజే అబ్దుల్ కలా మాటలే స్ఫూర్తిగా మార్చుకున్న ఒక పల్లెటూరి అమ్మాయి.. అన్ని సమస్యలను అధిగమించి అంతరిక్షానికి ఎలా చేరుకుంది అనేదే సినిమా(Aakasamlo Oka Tara). ఆ పల్లెటూరి అమ్మాయి ప్రయాణం ఎలా సాగింది? అందులో దుల్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా కూడా అభిమానుల అంచనాలను అధిగమించి అంతరిక్షాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Also Read : ది వన్ 2 ప్ ప్రోమోకు విమర్శల సెగ!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ది వన్ 2 ప్ ప్రోమోకు విమర్శల సెగ!

Alltimereport, Desk : తమన్నా(Tamannaah Bhatia), సిద్దార్థ్ మల్హోత్రా జోడీగా నటిస్తున్న...

సోనియా భయపడటం నేను చూడలేదు: రాహుల్..

Alltimereport, Desk:  తన తల్లి సోనియా గాంధీ భయపటం, వెనకడుగు వేయడం...