Lucky Baskhar | ఓటీటీ రిలీజ్‌కు రెడీ అంటున్న ‘లక్కీ భాస్కర్’

-

దుల్కర్(Dulquer Salmaan) అభిమానులకు లక్కీ న్యూస్ వచ్చేసింది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘లక్కీ భాస్కర్(Lucky Baskhar)’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బాక్సాఫీసులను దుల్కర్ దంచికొట్టాడు. వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ సినిమాతో కథతోనే కాకుండా కలెక్షన్లతో కూడా అదరగొట్టింది. దీపావళి గిఫ్ట్‌గా అక్టోబర్ 31న వచ్చిన ‘లక్కీ భాస్కర్’ లక్ బాగానే ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ(OTT) విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ సినిమా తాజాగానే 25 రోజుల థియేట్రికల్ రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాను నవంబర్ 30న విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

లక్కీ భాస్కర్ మూవీ వచ్చిన తొలి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్లే రాబడుతోంది. తొలి రోజే రూ.12.7కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. అప్పటి నుంచి కలెక్షన్స్ పరంగా ‘లక్కీ భాస్కర్’ చాలా స్టడీగా ముందుకు సాగుతోంది. కేవలం మూడు వారాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. ఈ కలెక్షన్లతో దుల్కర్ కెరీర్‌లో వంద కోట్ల మార్కెట్ చేసిన తొలి సినిమాగా ‘లక్కీ భాస్కర్(Lucky Baskhar)’ నిలిచింది. కాగా ఈ సినిమా కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్‌కు కాస్తంత ఆలస్యం కావొచ్చని టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఈ సినిమా ఇంకెంత కలెక్షన్లు సంపాదిస్తుందో.

Read Also: పెళ్ళి పీటలెక్కనున్న తమన్నా.. వరుడు అతడే..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...