టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులపై కోపం చూపించినా ప్రేమ చూపించినా ఆయన తర్వాతే, సమాజ సేవ చేయాలి అంటే బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా అధికారం ప్రతిపక్షం ఏమీ ఉండదు ఎప్పుడూ జనంలో ఉంటాడు ఆయన.. సినిమాలో హిట్ ఫ్లాఫ్ కూడా పట్టించుకోడు సినిమాలు చేస్తూనే ఉంటాడు బాలయ్య.
అందుకే బాలయ్యని అందరూ మా వాడు అంటారు, ఇక సేవ చేయడం విరాళాలు ఇవ్వడంలో గుప్త దానం చేసేవ్యక్తిగా ఆయనని చెబుతారు, క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా కొన్ని వేల మందికి చికిత్స అందిస్తున్నారు, అయితే తాజాగా మరో భారీ సాయం చేసి మనసు చాటుకున్నారు బాలయ్య.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హైదరాబాద్ వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ ఒక కోటి 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఎవరైతే ఇళ్లు కోల్పోయారో వారికి భరోసా కల్పించారు,
పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు. బాలయ్య బాబే ఇలా ముందు సాయం ప్రకటించారు, బాలయ్య చేసిన పనికి ఆయన ఫ్యాన్సే కాదు యావత్ తెలుగు ప్రజలు ఆయనని అభినందిస్తున్నారు.