తెలుగు స్టార్ ప్రొడ్యుసర్ కొడుకు హీరోగా ఎంట్రీ – ఎవరంంటే

తెలుగు స్టార్ ప్రొడ్యుసర్ కొడుకు హీరోగా ఎంట్రీ - ఎవరంంటే

0
101

చాలా మంది నిర్మాతలు దర్శకులు కొత్త కొత్త హీరోలని తయారు చేస్తారు…వారిపై పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తారు వారు సక్సెస్ గా స్టార్ హీరోలుగా వెలుగొందుతారు.. అయితే వారి వారసులని పెట్టి సినిమాలు తీసేవారు చాలా తక్కువ మంది అని చెప్పాలి, తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలతో పాటు, మాస్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. మరి ఆయన కుమారుడు కూడా సినిమాలపై ప్రేమతో తన తండ్రి నిర్మాతగా ఉంటే ఆయన హీరో అవుతా అని ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా రెడీ అయ్యారు, అయితే ఈ సినిమా ఆయన నిర్మించడం లేదు మరో నిర్మాత అయిన భరత్ చౌదరికి ఈ బాధ్యత అప్పగించారు. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. సాక్ష్యం తర్వాత ఈ సినిమా చేస్తున్నారు ఆయన, ఇక ఈ కథపై చాలా రోజులుగా వర్క్ చేశారు కథ మాటలు అన్నీ ఆయనే అందిస్తున్నారు ..ఇక హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోంది త్వరలో భారీగా ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేయనున్నారు ఈ చిత్ర ప్రకటన.