ఈ కారణంతోనే చిరుకు త్రిష నో చెప్పిందట…

ఈ కారణంతోనే చిరుకు త్రిష నో చెప్పిందట...

0
98

మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపోందుతోంది… ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా త్రిష నటిస్తుట్లు మొదట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ ఆచార్య నుంచి తప్పుకుంది… చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు అధికార ప్రకటన రాకుండానే ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్న వెంటనే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందంటూ తప్పుకుందట…

మొదట చెప్పిన విధంగా తీయడం లేదంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడంతో ఆచార్యలో ఏం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి… ఇక అదే సమయంలో సినీ వర్గాల్లో ఒక పుకారు కూడా తెగ షికారు చేసింది… రామ్ చరణ్ పాత్ర వల్ల త్రిష తప్పుకుందని అంటున్నారు… మొదట త్రిషకు కథ చెప్పిన సమయంలో చరణ్ పాత్ర పెద్దగా లేదట…

గెస్ట్ పాత్ర ఉంటుందని దర్శకుడు చెప్పాడట… కానీ ఇప్పుడు చిరు సూచన మేరకు ఆ పాత్ర కాస్త పెంచారట… దీంతో త్రిష పాత్ర మొత్తం మారిపోయిందట… త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తగ్గించారట… ఈ కారణంగానే త్రిష ఆచార్య నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది…