ఈ కొత్త సినిమాలతో ప్రభాస్ డైరీ అసలు ఖాళీ లేదు @ 2025 వరకూ

ఈ కొత్త సినిమాలతో ప్రభాస్ డైరీ అసలు ఖాళీ లేదు @ 2025 వరకూ

0
89

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యారు… ఇక అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు, ఇప్పటికే నాలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నారు.. టాలీవుడ్ లో ఎంతో ఫుల్ బిజీగా ఉన్న హీరో ప్రభాస్ అనే చెప్పాలి. రోజుకి 12 నుంచి 13 గంటల షూటింగులతో బిజీగా ఉన్నారు ప్రభాస్.

 

 

వరుస సినిమాలతో ప్రభాస్ డైరీ ఖాళీగా లేదు. 2025 వరకు ఫుల్ బిజీగా ఉండనున్నారట ప్రభాస్, అంటే సుమారు మరో నాలుగు సంవత్సరాలు, మరి ఏఏ ప్రాజెక్టులు అనేది చూస్తే …రాధేశ్యామ్ తుదిమెరుగులు దిద్దుకుంటూ ఉంది. ఇక ఆదిపురుష్ సలార్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి, ఈ రెండు చిత్రాలు అయిన తర్వాత నాగ్ అశ్విన్ సినిమా స్టార్ట్ అవుతుంది, అంటే అది వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఉండవచ్చు…ఈ సోషియో ఫాంటసీ సైంటిఫిక్ మూవీకీ భారీ డేట్స్ కేటాయించాల్సి ఉందట.

 

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయడానికి చూస్తున్నారు. ఇక ఆ తర్వాత మహిళా డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్లో ఇంకో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు ప్రభాస్ తో సినిమా కోసం కథలు సిద్దం చేస్తున్నారట, ఇవన్నీ 2025 వరకూ ఫుల్ బిజీ అని చెప్పకనే చెబుతున్నాయి.