ఈ నటి ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ నటి ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
89

మన దేశీయ చిత్ర సీమలో ఎక్కడ చూసుకున్నా హీరోలకి అత్యధిక రెమ్యునరేషన్ ఉంటుంది.. ఇక హీరోయిన్ కి చాలా తక్కువ మాత్రమే ఇస్తూ ఉంటారు.. అయితే బాలీవుడ్ లో ఇప్పుడు ఈ సీన్ మారింది, ఇప్పుడు అక్కడ హీరోయిన్లకి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు…ఇక తెలుగు తమిళ కన్నడ సినిమా పరిశ్రమల్లో కూడా హీరోయిన్లకు ఈ రెండు సంవత్సరాల నుంచి భారీ రెమ్యునరేషన్లు అందుతున్నాయి.

 

అయితే పలు దేశాల్లో హీరోల కంటే హీరోయిన్లకే రెమ్యునరేషన్లు ఎక్కువ ఉంటాయట, తాజాగా చైనాలో ఓ నటి గురించి వార్త వినిపిస్తోంది,చైనా నటి జెంగ్. ఈమె సినిమాకి ఇంత రెమ్యునరేషన్ అని ఉండదు, కాల్షిట్ బట్టీ ఒక్కో రోజుకి ఇంత అని తీసుకుంటుంది.

 

ఇక ఆమె ఒక్క రోజు రెమ్యునరేషన్ సుమారు 2 కోట్ల 40 లక్షల వరకూ తీసుకుంటుందట. సో 8 గంటలు షూటింగ్ చేసి ఆమె వెళ్లిపోతారు, షోలు సినిమాలు ఏమి అయినా ఆమె రెమ్యునరేషన్ ఇంతే ఉంటుంది అని అక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటి ఆమె అని సినిమా నగర్ లో టాక్ .