యూట్యూబ్ విలేజ్ – ఆ మెకానిక్ వల్ల ఊరంతా యూ ట్యూబ్ ద్వారా లక్షలు సంపాదన

Earned million rupees from YouTube all over the villagers due to mechanic

0
119

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిస్వాంతో ఇండోనేషియాలోని చిన్న గ్రామంలో అతను ఉంటున్నాడు. బైక్ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు. ఆ వచ్చే జీతంతో ఎన్నో ఇబ్బందులు పడేవాడు. అయితే అతనికి కొందరి ద్వారా యూట్యూబ్ గురించి తెలిసింది. దీని నుంచి వచ్చే ఆదాయం లక్షల్లో ఉంటుంది అని చాలా మంది అతనికి చెప్పారు కాని ఎలా స్టార్ట్ చేయాలో ఏం చేయాలో తెలియదు.

యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. కానీ పెద్దగా రెస్పాన్స్ రాలేదు ఇలా ఓరోజు బైక్ రిపేర్ కోసం ఓ వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడు. అతడు తన వెంట ఓ ఖరీదైన బైక్ తెచ్చాడు దాన్ని రిపేర్ చేసేందుకు స్వయంగా యూట్యూబ్ వీడియోలను చూడాల్సి వచ్చింది. కానీ అతనికి ఆ టెక్నికల్ మాటలు అర్దం కాలేదు చాలా ఇబ్బంది పడ్డాదు. దీంతో అందరికి అర్ధం అయ్యేలా తనే వీడియోలు రికార్డు చేయాలని ఆలోచించాడు.

అక్కడ నుంచి అతని వీడియోలకి లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నెలకి సుమారు రూ. 3 నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల్లో అతను చాలా డబ్బులు సంపాదించాడు. ఛానల్ గ్రోత్ అయింది. అంతా బాగానే ఉంది కానీ? ఇంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు అతడు క్షుద్రపూజలు చేస్తున్నాడని అందుకే ఇలా డబ్బులు వస్తున్నాయి అని ఊరిలో జనం అనుకున్నారు. కాని అతను గ్రామస్తులు అందరికి ఈ యూ ట్యూబ్ గురించి చెప్పాడు. ఉత్సాహం ఉన్నవారికి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఊరిలో 50 మంది ఈ ఛానల్స్ పెట్టుకుని స్వయంతకృషితో ఎదుగుతున్నారు ఇప్పుడు అది యూ ట్యూబ్ విలేజ్ అయింది.

https://youtu.be/gzhsdyWCqiE