ఇద్దరు బాలీవుడ్ సీనియర్ నటుల కూతుళ్లు తెలుగులో ఎంట్రీ

ఇద్దరు బాలీవుడ్ సీనియర్ నటుల కూతుళ్లు తెలుగులో ఎంట్రీ

0
99

రాజకీయాలు సినిమాల్లోకి నటీమణులు నటులు హీరోలు వంశపారపర్యంగా వస్తూ ఉంటారు.. ఆస్తులు ఎలా పంచుకుంటారో సినిమాలో ఎంట్రీని వారసత్వంగా పంచుకుంటారు.. అయితే తర్వాత వారి సినిమాపై వచ్చే ప్రశంసల బట్టీ వారి సినిమా లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది.. అయితే ఇది ఇక్కడ టాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్ కోలీవుడ్ అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉంది.

బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల కూతుళ్లు ఇప్పుడు ఒకేసారి టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. మరి వారు ఎవరు అంటే విజయ్ దేవరకొండ పూరి కలిసి ఓ చిత్రం చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను తీసుకున్నారు. ఇక ఆమెకు తెలుగులో ఇది మొదటి చిత్రం బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది

ఇక బాలీవుడ్ నటుడు, దర్శకుడు… పలు తెలుగు సినిమాల్లో విలన్ గా కూడా నటించిన మహేష్ మంజ్రేకర్ చాలా మందికి తెలుసు.. అతని కూతురు కూడా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది ఆమె పేరు సయీ మంజ్రేకర్. ఆమె మెగా హీరో వరుణ్ తేజ్ తో నటిస్తోందట, ఇక ఈ గ్లామర్ భామలకు తెలుగులో ఈ రెండు సినిమాలు ఎలాంటి అవకాశాలు కల్పిస్తాయో చూడాలి.