ఈ కథలో పాత్రలు కల్పితం రివ్యూ అండ్ రేటింగ్..!!

-

మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాత గా పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈకథలో పాత్రలు కల్పితం’.. సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కాగా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుకోగా ఈ సినిమా ప్రేక్షకుల ను ఏవిధంగా మెప్పించిందో ఈ సమీక్ష ద్వారా చూద్దాం..

- Advertisement -

కథ విషయానికొస్తే :

సినిమా ఇండస్ట్రీ లో హీరోగా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్న కృష్ణ( పవన్ తేజ్ కొణిదెల) కు తన ఫ్రెండ్ ద్వారా ఓ సినిమా లో హీరో ఛాన్స్ దొరుకుతుంది.. ఆ సినిమా ని రియల్ రత్నం (రఘు బాబు) నిర్మిస్తుంగా అప్పటికే హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉన్న రిహానా(లక్ష్మి) బయోపిక్ గా ఆ సినిమా తెరకెక్కుతుంది..ఆ సినిమా లో హీరోయిన్ గా రిహాననే నటిస్తుంది. అక్కడే హీరోయిన్ శృతి (మేఘన) పరిచయమవుతుంది.. అదే సమయంలో ఓ జర్నలిస్ట్ హత్య కు గురవుతుంది.. ఆ కేసు ను సాల్వ్ చేసే క్రమంలో SI రాజీవ్ (పృథ్వి) ఈ సినిమా షూటింగ్ పడుతుంది.. ఆ హత్యకు ఈ షూటింగ్ కి మధ్య సంబంధమేంటి అనేది అసలు సినిమా..

నటీనటులు :
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన పవన్ తేజ్ కొణిదెల పూర్తి స్థాయి హీరోగా మెప్పించాడు.. స్టైలిష్ లుక్ లో కనిపించాడు. నటన పరంగా అక్కడక్కడా మెగా స్టార్ ని తలపించాడు. ముఖ్యంగా ఛాలెంజ్ సినిమాలోని సీన్ లో చిరు ని మక్కికి మక్కీ దించాడు. ఇక హీరోయిన్ మేఘన హోమ్ లీ గా నటించింది.. ముంబై భామలను చూసి చూసి విరక్తి పుడుతున్న ప్రేక్షకుడికి అచ్చమైన తెలుగు అందం చూడట్లేదన్న కోరికను మేఘన తీర్చింది. హీరో ఫ్రెండ్ గా నవీన్ నేని మంచి కామెడీ ని పండించాడు. రఘు బాబు కాంబోలో మంచి హిలేరియస్ కామెడీ ను అందించాడు. రఘు బాబు ప్రొడ్యూసర్ గా ప్రేక్షకులను నవ్వించాడు..ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ కి ఉండే ఇబ్బందులను ఫన్నీ వే లో చూపిస్తూ తన మార్క్ టైమింగ్ ని యాడ్ చేశాడు. ఇక ఈ సినిమా లో రెండో హీరోయిన్ గా చేసిన లక్ష్మి గ్లామర్ పరంగా ఆకట్టుకుంది.. ఒకటి రెండు చోట్ల మంచి నటన కూడా కనపరిచింది. సినిమా డైరెక్టర్ గా అభయ్ నటన ఆకట్టుకుంది.. నోయెల్ ఓ ముఖ్యమైన పాత్రలో చేసి ప్రేక్షకులను అలరించాడు.. సినిమాలో ఆయనదే మెయిన్ క్యారక్టర్..ఇక జర్నలిస్ట్ పాత్రలో ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు ఎంతో న్యాచురల్ గా నటించారు. మిగితా పాత్ర దారులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు కథ రాసుకున్న విధానం చాలాబాగుంది.. ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చుపించాడంటే దానికి ఎంతో అనుభవం ఉండాలి.. కానీ దర్శకుడు అభిరాం కొత్త దర్శకుడైన అనుభవం ఉన్న దర్శకుడిలా ఎంతో అద్భుతంగా చిత్రాన్ని మలిచాడు.. చివర్లో ట్విస్ట్ సినిమా కి హైలైట్.. టేకింగ్ పరంగా అభిరాం మంచి ప్రతిభను చూపించాడు. సినిమా ఎక్కడా బోర్ అనిపించదు.. ఫస్ట్ హాఫ్ లో ఫన్ జెనరేట్ అయ్యేలా మంచి కామెడీ సీన్స్ రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ప్రీ క్లైమాక్స్ లో ఊహించిన ఏ సంఘటన క్లైమాక్స్ లో జరగదు.. అదే సినిమా కి కావాలి.. దర్శకుడు దీంట్లో సఫలమయ్యారు. సంభాషణలు కూడా బాగానే ఉన్నాయి. సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల పాటలు బాగున్నాయి..టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.. ఎడిటర్, సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఇక నిర్మాత ఖర్చు సినిమాలో తెలుస్తుంది.. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి షాట్ ఎంతో రిచ్ గా వుంది.. హీరో హీరోయిన్ కొత్తవారైనా మిగితా ఆర్టిస్లు తెలిసినవారినే తీసుకున్నారు. అది సినిమా కి ప్లస్ పాయింట్ అయ్యింది.

హైలైట్స్ :
పవన్ తేజ్ నటన
లక్ష్మీ గ్లామర్
కామెడీ సీన్స్
ట్విస్ట్స్
క్లైమాక్స్
నిర్మాణ విలువలు

తీర్పు : క్రైమ్ ను కామెడీ ని మిక్స్ చేసి తీసిన సినిమా.. ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో ఇలాంటి పాయింట్ తో ఏ సినిమా రాలేదు. సెకండ్ హాఫ్ మొదట్లో తడబడినా ప్రీ క్లైమాక్స్ లో సినిమా పుంజుకుంది.. ఓవరాల్ గా మంచి సినిమా లేక అల్లాడిపోతున్న ప్రేక్షకులకు ఈ కథలో కల్పితం సినిమా బెస్ట్ ఛాయస్..

రేటింగ్ : 3.5/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...