ఈ రీజన్ తోనే చిరు అలా వైకుంఠపురంలోకి రాలేకపోయాడట

ఈ రీజన్ తోనే చిరు అలా వైకుంఠపురంలోకి రాలేకపోయాడట

0
104

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురంలో…. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ కు పూజా హెగ్డే సరసన వహిస్తోంది… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా నిర్వహించారు.. ఫ్యాన్స్ మధ్య అంగరంగా వైభవంగా నిర్వహించిన ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవుతారని అందరు భావించారు…

కానీ ఆయన హాజరు కాలేదు అయితే ఆయన హాజరు కాకపోవడానికి బలమైన రీజన్ ఉందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది… కొద్ది కాలంగా అల్లు కుటుంబానికి చిరు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అందుకే చిరు ఈ ఈవెంట్ కు హాజరు కాలేదని అంటున్నారు…

అయితే బన్నీ మాత్రం తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అని ఆతర్వాత రజనీకాంత్ అంటే ఇష్టమని చెప్పారు చచ్చేంతవరకు తనకు చిరంజీవి ఇష్టమని చెప్పారు కాగా అంతకు ముందు జరిగిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయిన చిరు బన్నీ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ కు హాజరు కాకపోవడం గమనార్హం