ఈసారి చిరంజీవి ప్లాన్ ఫలించేనా

ఈసారి చిరంజీవి ప్లాన్ ఫలించేనా

0
93

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమాతో మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు, పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా అభిమానులు అదే బ్రహ్మరథం పట్టారు ఆయన సినిమా బంపర్ హిట్ అయింది.. తర్వాత వచ్చింది సైరా ఇది భారీ బడ్జెట్ సినిమా..
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లోనూ విడుదలైంది. అయితే.. విమర్శకుల ప్రశంసలు పొందింది.

తాజాగా ఆయన కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..
కేవలం తెలుగు వరకే పరిమితం చేయాలనుకున్న కొరటాల ప్రాజెక్టుని.. ఇప్పుడు పలు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే కొణిదెల మ్యాట్నీ రెండూ కలిసి చేస్తున్న సినిమా ఇది ఇక బడ్జెట్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెల ఎండింగ్ లో చిత్రం షూటింగ్ కు వెళ్లనుంది.దేవాదాయ శాఖలో అవినీతిపై సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట కొరటాల. సామాజిక సందేశంతో కూడిన యూనివర్సల్ సబ్జెక్ట్‌ అందుకే ఇది సక్సెస్ అవుతుంది అని కొరటాల భావిస్తున్నారట.