ఈ ముగ్గురికి పవన్ గ్రీన్ సిగ్నల్ దిల్ రాజు ఖుషీ

ఈ ముగ్గురికి పవన్ గ్రీన్ సిగ్నల్ దిల్ రాజు ఖుషీ

0
94
Pawan Kalyan

పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించాలి అని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అనేది తెలిసిందే, హిందీలో బ్లాక్ బస్టర్ కొట్టి… తమిళంలోనూ ఘనవిజయం సాధించిన పింక్ రీమేక్ లో నటించేందుకు అంగీకరించారు. నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఈ సినిమా ఇంతకుముందు లాంఛనంగా ప్రారంభమైంది.. అయితే హీరోగా పవన్ ఫిక్స్ అనేది వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంక క్లారిటీ అయితే రానుంది త్వరలో.

ఈ చిత్రంలో పవన్ సరసన మలయాళీ బ్యూటీ నివేదా థామస్ ను ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అలాగే తెలుగమ్మాయి అంజలికి వేరొక కీలక పాత్రలో అవకాశం ఇచ్చారట, ఇక తాప్సీని మరో హీరోయిన్ గా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి కాని ఆమె బదులు. మల్లేశం చిత్రంలో నటించిన అనన్యను ఫైనల్ చేశారట.

అయితే పవన్ కూడా వీరి ముగ్గురిని ఫైనల్ చేశారు అని తెలుస్తోంది.. ఇటీవల చిత్ర యూనిట్ కూడా పవన్ కు తెలియచేసిందట. ఈ ముగ్గురు భామల ఫోటోలు ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. తమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు, అలాగే వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు.