మలయాళ సినిమాలో తెలుగమ్మాయికి అవ‌కాశం 

Eesha rebba got Opportunity in Malayalam cinema

0
104
నిజ‌మే మ‌న తెలుగు సినిమాల్లో , మ‌న తెలుగు తార‌ల కంటే ముంబై భామ‌లు, బాలీవుడ్ ,కోలీవుడ్ హీరోయిన్లు ఇక్క‌డ అనేక సినిమాలు చేస్తున్నారు. ఇక్క‌డ ద‌ర్శ‌కులు కూడా అక్క‌డ భామ‌ల‌నే ఒకే చేస్తున్నారు. అయితే మ‌ల‌యాళ సినిమాలో మ‌న తెలుగు అమ్మాయికి అవ‌కాశం వ‌చ్చింది.
ఇటీవ‌ల మ‌ల‌యాళ హీరోయిన్లు చాలా మంది మ‌న తెలుగు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మ‌న తెలుగు హీరోయిన్ ఎవ‌రు ఈ అవ‌కాశం ద‌క్కించుకున్నారు అంటే
ఈషా రెబ్బా అనే చెప్పాలి. రాగల 24 గంటల్లో సినిమా ఈషాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.
ఇక అర‌వింద స‌మేత చిత్రంలో కూడా ఆమె న‌టించింది.
ఇక తమిళ్ లో కూడా అనేక చిత్రాలు చేస్తోంది. ఆమె ప్ర‌స్తుతం మ‌లయాళం చిత్రం నుంచి అవ‌కాశం పొందింద‌ట‌.కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించింది. ఫెల్లి దర్శకత్వం లో ఈ సినిమా రానుంది. అంతేకాదు ఈ చిత్రంలో
అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్ర చేస్తున్నారు.