ఇక లైఫ్ లో ఆ తప్పు చేయనంటున్న అనూ ఇమ్మానియేల్

ఇక లైఫ్ లో ఆ తప్పు చేయనంటున్న అనూ ఇమ్మానియేల్

0
109

అను ఇమ్మానియేల్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అనే చెప్పాలి, టాలీవుడ్ లో అగ్రహీరోలతో సినిమాలు చేసింది, మంచి అందం అభినయం ఉన్న నటి, కాని హిట్లు మాత్రం ఆమెని పెద్ద పలకరించలేదు, టాలీవుడ్ కి మజ్ను సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.

అల్లు అర్జున్ తో . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించింది, అది పెద్ద ఆమెకు పేరు తీసుకురాలేదు. తర్వాత నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించింది ఈ చిత్రం యావరేజ్ గా హిట్ అయింది. ఇక అజ్ఞాతవాసిలో కూడా ఆమె నటించినా అది కూడా ఆమెకి పెద్ద ఫేమ్ తీసుకురాలేదు.

ఇక ఆమె తనకు ఇలా హిట్లు రాకపోవడానికి కారణం చెప్పింది, నేను కధలు ఎంచుకోవడంలో పొరపాటు చేశాను అని తెలిపింది. నా పార్ట్ మాత్రమే కధ వినేదానిని, దీని వల్లనాకు అట్టర్ ఫ్లాప్ గా సినిమాలు మిగిలి పోయాయి. ఇక ఆ తప్పు తెలుసుకున్నా కచ్చితంగా పూర్తి కధ వింటా అన్నీ గుడ్డిగా నమ్మను అని చెబుతోంది ఈ భామ.. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాలో ఆమె నటిస్తోంది.