ఇక పై వాటికి గుడ్ బై చెప్పేస్తున్నా – రాశి ఖన్నా

ఇక పై వాటికి గుడ్ బై చెప్పేస్తున్నా - రాశి ఖన్నా

0
105

తెలుగులో అందాల తారగా వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రత్యేకస్టార్ డమ్ సంపాదించుకుంది అందాల భామ రాశిఖన్నా, అందం అభినయం నటనలో షేడ్స్ చూపించగలదు, అంతేకాదు ఆమె ఏ ప్రాతని అయినా అవలీలగా చేయగలదు అనే పేరు సంపాదించింది, స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ తార.

కెరియర్ లో నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు వెళుతోంది. అలాంటి రాశి ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించింది. అయితే అప్పటి వరకూ ఆమె ఇలా చేయదు అనుకున్న వారు చూసి ఆశ్చర్యపోయారు, కాస్త అభిమానులు షాక్ అయ్యారు, అయితే అంతలా ఆమె చేసిన పాత్రకు కూడా ఎలాంటి గుర్తింపు రాలేదు, సినిమా కాస్త నిరాశ పరిచింది.

ఈ ఫెయిల్యూర్ తో ఆమె మరింత డీలాపడ్డారు. ఆ పాత్రను గురించి తాజాగా రాశి ఖన్నా స్పందిస్తూ .. ఆ సినిమాలో నేను ఆ పాత్రను చేసి వుండకూడదు. ఆ పాత్రను ఒప్పుకుని ఒక రకంగా పొరపాటు చేశాను. నేను చేసిన ఆ పాత్ర నా పేరెంట్స్ ను కూడా బాధపెట్టిందని గ్రహించాను అని చెప్పింది, ఒకవేళ ఇలాంటి పాత్రలు వస్తే ఇక చేయను అని చెప్పింది, ఇక తన గ్లామర్ విషయంలో హద్దులు దాటని పాత్రలు చేస్తాను అని చెప్పింది రాశిఖన్నా.