తమిళ నటుడు విజయ్ సేతుపతికి సినిమా అవకాశాలు భారీగా వస్తున్నాయి…తెన్ మెర్కు పరువ కాట్రు ఈ సినిమా హిట్ అయిన తర్వాత అనేక సినిమాలు చేస్తున్నారు ఆయన.. తమిళ్ మాత్రమే కాదు సౌత్ ఇండియాలో ఎక్కడ ఏ సినిమాలో అవకాశం వచ్చినా ఆయన నటిస్తున్నారు.. ఇక తాజాగా మాస్టర్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించాడు.. ఈ చిత్రం చూసిన అందరూ కూడా ఆయన నటనకు 100 కి 100 మార్కులు వేస్తున్నారు.
మాస్టర్ చిత్రంలో దళపతి విజయ్ కి ప్రతి నాయకుడిగా నటించి మెప్పించడంతో మంచి క్రేజ్ వచ్చింది.. ఇక తాజాగా వెబ్ సిరీస్ లో కూడా నటించే అవకాశం వచ్చిందట… అయితే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఓ ప్రాజెక్టులో షాహిద్ కపూర్, రాశీ ఖన్నాలతో కలిసి విజయ్ సేతుపతి నటించేందుకు సైన్ చేశాడని తెలుస్తోంది.
అయితే ఈ సిరీస్ లో ఏకంగా అతని కి భారీ రెమ్యునరేషన్ సుమారు 50 కోట్ల వరకూ అందుతుంది అని తెలుస్తోంది.
షాహిద్ కపూర్ కు రూ. 40 కోట్లే దక్కనున్నాయట. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది..సున్నీ పేరిట ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ కానుంది. దీనికి రాజ్ దర్శకత్వం వహిస్తారు. ఇది అమెజాన్ లో స్ట్రీమ్ కానుంది.