అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్3 ని అనిల్ రావిపూడి తెరెకెక్కించి భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుండడంతో చిత్రబృందం ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్రాజు మాట్లాడారు.
కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాదించినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. ఎఫ్-2′, ‘ఎఫ్-3’లను మించేలా ‘ఎఫ్-4’ ఉండేలా అనిల్ రావిపూడి ఇప్పటి నుంచే కథ సిద్ధం చేస్తున్నాడని తెలిపి అటు వెంకీ అభిమానులను, ఇటు వరుణ్ అభిమానులను ఖుషి చేసాడు. ప్రస్తుతం ప్రేక్షకులు సైతం ఎఫ్-4 కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.