ఎఫ్ 2సీక్వెల్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

ఎఫ్ 2సీక్వెల్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

0
90

మార్చి చివరి నుంచి సినిమా షూటింగులు ఆగిపోయాయి, ఎక్కడా చిత్రాలు షూటింగ్ జరగడం లేదు.
ఇక కరోనా నిబంధనలు ఇచ్చి ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చింది, అయినా పెద్ద స్టార్స్ మాత్రం సినిమా షూటింగులకి రావడం లేదు, ఇక నవంబర్ లోనే సినిమా షూటింగులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

చాలా మంది వైరస్ షూటింగులను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు వెంకటేశ్ కూడా ఇప్పట్లో షూటింగులకు వచ్చేది లేదని చెబుతున్నారు అని తెలుస్తోంది.
నారప్ప చిత్రం షూటింగ్ చాలావరకు లాక్ డౌన్ కి ముందు అవుట్ డోర్ లో జరిగింది. ఇక తర్వాత షూటింగ్ ఆగిపోయింది. ఇక కరోనాతో ఇప్పుడు షూటింగ్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.

ఇక వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి రూపొందించే ఎఫ్ 2సీక్వెల్ షూటింగ్ కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి తర్వాత షూటింగ్ షెడ్యూల్స్ వేసుకోమని వెంకీ దర్శకుడు అనిల్ కు చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి, మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది స్టార్ట్ అవ్వనుందట.