ఎఫ్‌3 నుండి అదిరిపోయే అప్డేట్..పార్టీ వీడియో సాంగ్ రిలీజ్

0
111

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు.

ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. దాంతో ఎఫ్ 3 కూడా తీయాలని నిర్ణయించినుకొని ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేయనున్న క్రమంలో తాజాగా చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ వదిలింది.

ఈ చిత్రంలోని స్పెష‌ల్ సాంగ్ వీడియోను మేక‌ర్స్ ఫాన్స్ ను ఖుషి చేసారు. ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే వీడియో సాంగ్‌  1.20 నిమిషాలు కొనసాగి  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పూజాహెగ్డే, వెంకీ, వరుణ్ అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను ఫిదా చేసారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/mYJhsxm4STo