ఎఫ్ 3 సినిమాలో మరో ఇద్దరు – క్లారిటీ వచ్చేసింది

ఎఫ్ 3 సినిమాలో మరో ఇద్దరు - క్లారిటీ వచ్చేసింది

0
81

అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు… శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కరోనా బ్రేకులు వేసింది… లేకపోతే ఈ సినిమా షూటింగ్ అంతే వేగంగా పూర్తి చేసి విడుదల చేయాలి అని ప్లాన్ వేశారు చిత్ర యూనిట్.. అందుకే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు…. అయితే థియేటర్లు క్లోజ్ అయ్యాయి, సినిమాలు షూటింగులు నిలిచిపోయాయి.

 

ఇక ఎఫ్ 3 సినిమాలో వెంకటేశ్ … వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ పాత్రలు కంటిన్యూ అవుతున్నాయి. ఈసారి మరో ఇద్దరు ఇందులో నటిస్తున్నారట.. వారు సునీల్ అంజలి అని తెలుస్తోంది..ఈ సినిమాను ఆగస్టు 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా.

 

ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్టుగా అనిల్ రావిపూడి చెప్పారు.. పైగా నటీ నటుల డేట్స్ అడ్జిస్ట్ కావాలి ఇవన్నీ సెట్ చేసి మరో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారట..కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో చెబుతామని అంటున్నారు, సో కరోనా కేసులు తగ్గి అంతా సాధారణం అయితే వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చని టాలీవుడ్ టాక్.