ఎఫ్ 3 హీరోయిన్లపై క్లారిటీ వచ్చేసింది ఎవరంటే

ఎఫ్ 3 హీరోయిన్లపై క్లారిటీ వచ్చేసింది ఎవరంటే

0
90

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తెలుగులో అదరగొట్టేసింది ఎఫ్ 2… ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా రానుంది అనేది గతంలోనే వార్తలు వినిపించాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమా కథ పైనే ఫోకస్ చేశారు.

తాజాగా మహేష్తో ఆయన చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ సక్సెస్ సాధించడంతో.. వరుసగా అపజయం అంటూ లేని డైరెక్టర్గా అనిల్ రావిపూడి పేరు పొందాడు. ఈ సమయంలో ఎఫ్ 3 పట్టాలెక్కించాలి అని చూస్తున్నారు, అయితే ఇందులో ముగ్గురు హీరోలు అంటూ వార్తలు వచ్చాయి కాని ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో ఎఫ్ 3లో నటించే హీరోయిన్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్లనే అనుకుంటున్నాడట. ఎఫ్ 3’లో కొత్త హీరోయిన్లు నటిస్తారనే వార్తలు నమ్మకండి అంటూ చెప్పేశాడు, సో హీరోల విషయం కూడా ఇక వెంకీ, వరుణ్ తేజ్ నటిస్తారు అని తెలుస్తోంది.