ఎఫ్ 3 కి అడ్డంకి ఏమిటి దర్శకుడి ఆలోచన ఏమిటి

ఎఫ్ 3 కి అడ్డంకి ఏమిటి దర్శకుడి ఆలోచన ఏమిటి

0
103

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 చిత్రం ప్రేక్షకులని అలరించింది, ఇక ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో దర్శకుడు అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్ తీస్తాను అన్నారు, అదే ఎఫ్ 3.. అయితేఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో మంచి హిట్ సంపాదించాడు అనిల్.

అయితే వచ్చే ఏడాది ఎఫ్ 3 ప్లాన్ చేశారు.. కాని వచ్చే ఏడాది రాజమౌళి చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుంది, అందుకే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు అంటున్నారు, అయితే ఈ సినిమా విడుదల ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఎందుకు అంటే ఇంకా చిత్రం పై కొన్ని చర్చలు జరుపుతున్నారట.

ఇందులో ముగ్గురు హీరోలు ఉండనున్నారు…వెంకటేష్ వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఇటీవల రవితేజ పేరు వినిపించింది కాని ఆయన ఈ చిత్రంలో నటించడం లేదు అని తెలుస్తోంద. ఇక మహేష్ తో కూడా చర్చలు జరిపారు.. కాని ఆయన ఆసక్తి చూపించలేదు అని తెలుస్తోంది. అయితే శర్వానంద్ రాజ్ తరుణ్ ఇలా మరెవరితో అయినా చర్చించి అప్పుడు సినిమా ప్లాన్ చేస్తారు అని తెలుస్తోంది.