విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్2… గత సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..
ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే… ఎఫ్2 సీక్వెల్ లోనే ఎఫ్3 తీయనున్నారట అనిల్ రావుపూడి… ఎఫ్3లో ముగ్గురు హీరో ఉన్నట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు…వరుణ్ తేజ్ వెంకటేష్ లతో పాటు మాస్ రాజా రవితేజ కూడా ఎఫ్3లో సందడి చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన కథను కూడా దర్శకుడు దగ్గర రెడీగా ఉందట… దీనిని త్వరలోనే స్క్రిప్ట్ గా మార్చనున్నట్లు ఫిలిం వర్గాలనుంచి అందుతున్న సమాచారం..