ఎఫ్3 మూవీ రివ్యూ..పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

0
116

కరోనా మహమ్మారి కారణంగా గత కొంతకాలంగా వాయిదా పడ్డ సినిమాలు ఒక్కోటిగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఖుషి చేస్తున్నారు. ఇటీవలే సర్కారు వారి పాట, ఆచార్య, కెజిఎఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్  సినిమాలను రిలీజ్ చేసిన క్రమంలో తాజాగా నేడు ఎఫ్ 3 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని సన్నాహాలు చేసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3.

ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెకెక్కించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో మే 27వ తేదీన అనగా నేడు విడుదలై ధీయేటర్లలో సందడి చేయనున్న క్రమంలో  సినిమా టాక్ గురించి పబ్లిక్  ఏమనుకుంటుందో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఈ సినిమా డబ్బు అనే కోణంలో పారంభంకాగా..విక్టరీ వెంకటేష్, వరుణ్ డబ్బు, బంగారం అంటే ఆశ పడే భార్యలకు భర్తలుగా కనిపించారు. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో ఆలీ, సునీల్‌ల కామెడీ టైమింగ్ తో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కానీ ఈ సినిమాలో రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన సంగీతం ప్రేక్షకులను అనుకున్నమేరకు ఆకట్టుకోలేదని అంటున్నారు.  ఎఫ్ 3 సినిమాలో సునీల్, ఆలీ, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ అదనంగా చేరడం జరిగింది. ఇక  పూజాతో స్పెషల్ సాంగ్ విషయానికొస్తే ఈ పాట గురించి ఒక్కరు ప్రస్తావించడం లేదు. క్లైమాక్స్ ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఎఫ్3 ఎలాంటి కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటుందో..!