ఎఫ్3 ప్రభంజనం..నాలుగో రోజూ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

0
112

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్3 ని అనిల్ రావిపూడి తెరెకెక్కించి భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేసింది.  అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఈ సినిమా కుటుంబం మొత్తం థియేటర్‌లకు వచ్చి చూడాలనే లక్ష్యంతో చేసిన విధంగానే ఎంజాయ్ చేసారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ.4.64 కోట్లు రాబ‌ట్టిన‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌. ఏపీ, తెలంగాణ‌లో నాలుగు రోజుల్లో మొత్తం షేర్ రూ.32.11 కోట్ల‌ని సమాచారం తెలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.